???? బీర్కూర్ మండల ప్రజలు అధైర్య పడవద్దు
???? అధిష్టానం నిర్ణయాన్ని గౌరవించి కలిసి సమిష్టిగా పని చేద్దాం
???? నేను స్థానికంగానే ఉండి సేవ చేస్తా — ఏనుగు రవీందర్ రెడ్డి
V1 న్యూస్ బీర్కూర్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: బాన్సువాడ నియోజకవర్గం లోని బాన్సువాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో, నసురుల్లాబాద్ మండల కేంద్రంలో విజయ్ కుమార్ రెడ్డి రైస్ మిల్ ప్రాంగణంలో, మరియు బీర్కూర్ మండల కేంద్రంలోని సాహెబ్ రావు ఫంక్షన్ హాల్ లో మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మనోధైర్యాన్నిస్తూ.. ఓదార్పు సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఏనుగు రవీందర్ రెడ్డి హాజరయ్యారు.ఈసమావేశంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలకు ఏనుగు రవీందర్ అండగా ఉన్నారని ఏనుగు రవీందర్ రెడ్డి వెంటే మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం ఉంటామని, ఆయనకు కీలకమైన పదవి లేదా నియోజకవర్గ ఇన్చార్జిగానే కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కోరుకున్నారు. అనంతరం బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి ఏనుగు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ మొదటి నుండి బీర్కూర్ మండల ప్రజలు తనకు వెన్నంటు ఉండి ఎమ్మెల్యే మరియు ఎంపీ ఎన్నికలలో మంచి మెజార్టీ, అందించారని బీర్కూర్ మండల ప్రజలకు రుణపడి ఉంటానని చేతులెత్తి నమస్కరించారు.కాంగ్రెస్ పార్టీకి మంచి జరగాలని పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి మనం అందరం కట్టుబడి ఉండి పనిచేయాలన్నారు. బీర్కూర్ మండల ప్రజలెవ్వరూ కూడా అధైర్య పడవలసిన అవసరం లేదని, నేనిక్కడే ఉంటున్నా, నా ఓటు హక్కు బాన్సువాడ నియోజకవర్గానికి మార్చుకున్నానని వారికి భరోసా కల్పించారు. నసురుల్లాబాద్ ఎక్స్ రోడ్ సమీపంలో తన గృహ నిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమం పూర్తయిందని.. నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తకు, ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయడమే తన లక్ష్యమని మాట్లాడారు.ఎవరో మాట్లాడితే భయపడి పారిపోయే వ్యక్తిని తాను కాదని, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన అనుభవం తనకు ఉందని, భాజాప్త ,పక్క తాను ఇక్కడే ఉండి నియోజక వర్గ ప్రజలందరికి సేవ చేసుకుంటు అన్ని మండలాలను అభివృద్ధి చేస్తానని కార్యకర్తలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజవర్గ నాయకులు యలమంచిలి శ్రీనివాస్, బస్వరాజ్ పటేల్, విజయ్ కుమార్ (నందు) రెడ్డి , చాగం కృష్ణరెడ్డి, కొండారెడ్డి, కొత్తకొండ భాస్కర్, మరియు బీర్కూర్ మండల నాయకులు సానెపు పెద్ద గంగారం, చందు, మాజీ ఎంపిటిసి సుధాకర్ యాదవ్, బరంగేడిగి అనిల్ కుమార్, రాచప్ప పటేల్, ఇక్బాల్, యమ చిన్నరాములు, పోగు నారాయణ, మాల్గే చిన్న క్యాకప్ప, బండ సాయిలు, ఈరాస్ సాయిలుయాదవ్, పోతలవెంకటేశం, సోషల్ మీడియా అప్సర్, రవి, మెంట శంకర్ మరియు వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








