అధికార ప్రతిపక్ష లీడర్ల ప్రోత్సాహంతోటే
పెంట గ్రామ సరిహద్దు ప్రాంతంలో బంగారు మైసమ్మ తల్లి ఆలయం పక్కన
ఓ రైస్ మిల్ కు సంబంధించిన గోడౌన్ నిర్మాణంలో
సదురు నిర్వాహకులు బడా బాబు కావడం
ఆయనకు ప్రతిపక్ష, అధికార పార్టీ నాయకులు అండదండలు ఉండడం
తమకి ఎవ్వరు లే అడ్డు అదుపు అంటూ వేల సంఖ్యలో ఇసుక ,మొరం డంపు చేస్తున్న వైనం అని ప్రజల అనుమానాల…

బోధన్
పెంట
నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గ బోధన్ మండలం పెంట గ్రామ సరిహద్దు ప్రాంతంలో బంగారు మైసమ్మ తల్లి ఆలయం పక్కనే ఓ రైస్ మిల్ సంబంధించిన గోదాం నిర్మాణంలో భాగంగా వేల సంఖ్యల ఇసుక మొరం డంప్ అయిందని, ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ ఆదానికి గండి కొట్టే విధంగా వాల్టా చట్టానికి తూట్లు పొడిచే విధంగా నిర్వాహకులు, వేల సంఖ్యలో ఇసుకను దిగుమతి చేసుకొని డంపు చేశారని అదేవిధంగా మొరం కూడా డంపు చేసుకొని ఉన్నారని ప్రతిరోజు పగలు రాత్రి అని తేడా లేకుండా ఇసుక ,మొరం, తెచ్చుకుంటూ డంపు చేస్తున్నారని పలువురు మండి పడుతున్నారు, ఈ విషయం గురించి పత్రికా మీడియాలో వచ్చినప్పటికీ ఆర్డిఓ ఎంఆర్ఓ కు ఫిర్యాదు చేసిన ఎవ్వరు కూడా స్పందించడం లేదని ఇప్పటివరకు బోధన్ రూరల్ ఆర్ ఐ, విచారణ చేసి రిపోర్టు సంబంధిత శాఖ అధికారులకు అప్పజెప్పిన ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక అధికార ప్రతిపక్ష పాలకులు లీడర్ల ప్రమేయం తోటే, చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
సదురు గోడౌన్ నిర్వహకులకు వీరి అండదండలు ఉండడం వలన, ఎందుకంటే వ్యవస్థను నడిపేది వారే కావున అనే అనుమానాలు ఉండబట్టి, వారికి ప్రభుత్వ వనరులను అప్పజెప్తున్నారని, ముఖ్యంగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అదేవిధంగా బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి రవీందర్ రెడ్డి తో పాటు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అదేవిధంగా, ఇతర పార్టీలోని కొంతమంది నాయకుల అండదండలు ఉన్నాయని వీరి యొక్క అండదండలతో ఎక్కడ గోడౌన్ నిర్మాణం జరిగిన ఎక్కడా రైస్మిల్ల నిర్మాణం జరిగిన అక్కడ పుగట్టుగా ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక మొరం వేల సంఖ్యలో డంపు చేసి పెట్టుకుంటున్నారని, గతంలో కూడా ఈ విధంగా డంపు చేసుకొని వాల్టా చట్టం తూట్లు పొడిచి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రజలకు అనుమానాలు నివృత్తి చేయాలంటే పాలకులు లీడర్లు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని పలువురు కోరుతున్నారు. వాస్తవానికి ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి సుదర్శన్ రెడ్డి అదేవిధంగా రవీందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఇతర లీడర్ల ప్రమేముందా వారి సహకారంతోనే డంపు జరుగుతుందా, సంఖ్యలో డంపు ఉన్న ఇసుక ఎందుకు సీజ్ చేయడం లేదు అధికారులు వారిపై వీరి యొక్క ఒత్తిడిలు ఉన్నాయా, వారి యొక్క విధులు నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తున్నారంటే ఓవైపు మామూలు తీసుకొని ఉండాలి లేకపోతే పైన వారి యొక్క ఒత్తిడిలు ఉండాలి, అని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఏది నిజం ప్రజలకు సమాధానం తెలియాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు
ఈ వార్త ప్రజల పక్షాన వచ్చిన ఆరోపణ ద్వారా వార్త రాయడం జరిగింది, ఎవరిని ఉద్దేశించి కాదు ,ఎవరిని కించపరచలని కాదు, ప్రజల పక్షాన వ్రాస్తున్న వార్త,
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








