Post Views: 99
వృద్ధాశ్రమానికి రూ.లక్ష విరాళం
V1 న్యూస్ ఎల్లారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా :ఎల్లారెడ్డి నియోజకవర్గం తాడ్వాయి మండలంలోని ఏండ్రియాల్ గ్రామంలో గల వృద్ధాశ్రమానికి మంగళవారం రోజు బిజెపి నాయకుడు, జపాన్ శాస్త్రవేత్త అయిన డాక్టర్ పైడి ఎల్లారెడ్డి రూ. లక్ష విరాళం అందించాడు. ఆశ్రమ సదుపాయాలకు వృద్ధుల సహాయార్థం రూ. లక్షను ఉపయోగించి వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని నిర్వాహకులను కోరారు. ఆశ్రమ అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏండ్రియాల్ గ్రామ మాజీ సర్పంచ్ పాటిమిడి సరోజన సాయి రెడ్డి, మండల స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








