V1News Telangana

best news portal development company in india

గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించే కంపోస్టు ఎరువు షెడ్డును పరిశీలించిన ఎంపీఓ…

SHARE:

V1 న్యూస్ బీర్కూర్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: బీర్కూర్ మండలంలోని రైతు నగర్ గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించే కంపోస్టు ఎరువు షెడ్డును మంగళవారం రోజు ఎంపీఓ అనిత ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో నిత్యం సేకరించే వ్యర్థాలలో తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి దాని ద్వారా కంపోస్ట్ ఎరువు ను తయారు చేయించాలని తెలిపారు. కంపోస్ట్ ఎరువు అత్యధికంగా ఉత్పత్తి చేసి నర్సరీలో గల మొక్కలకు అందించాలని తెలిపారు. మొక్కలకు వినియోగించగా ఎక్కువగా ఉన్న ఎరువులు రైతులకు విక్రయించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎరువును విక్రయించ గా వచ్చిన నగదును గ్రామపంచాయతీ రికార్డులలో జమ చేయాలని తెలియజేశారు. ఈ సందర్భంలో ఆమెతోపాటు గ్రామపంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ మరియు పారిశుద్ధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india