V1News Telangana

best news portal development company in india

ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా తహసిల్దార్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్…..

SHARE:

V1 న్యూస్ నసురుల్లాబాద్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో గల తహసిల్దార్ కార్యాలయంలో సోమవారం రోజు “ప్రజావాణి” కార్యక్రమంలో భాగంగా స్థానికంగా ఉండే అధికారులు న్యాయం చేయకపోవడం వలన జిల్లా కలెక్టర్ ఆశ్రయించిన వారి దరఖాస్తులను అప్పటికప్పుడు సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి బాధితుల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తెలుపుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. “ప్రజావాణి”కార్యక్రమం ప్రతి సోమవారం రోజు తహసిల్దార్ కార్యాలయంలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించబడుతుందని తహసీల్దార్ ఎల్. ప్రవీణ్ కుమార్ తెలియజేశారు. ప్రజలు తమ సమస్యలను సంబంధిత అధికారులు పరిష్కరించని యెడల తహసిల్దార్ కార్యాలయంలో గాని లేదా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కానీ ఫిర్యాదు చేయాలని తెలిపారు. ప్రజలు “ప్రజావాణి” కార్యక్రమాన్ని వినియోగించుకొని తమ సమస్యలను వేగంగా పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నీలావతి, ఎంపీ ఓ రాము,JVO త్రివిక్రమ్, ఐసిడిఎస్ సూపర్వైజర్ వాణి, RWSS AEE అశ్విని, MPHSCE సుశీల, MGNREGS( APO) సౌజన్య, HMPS హన్మండ్లు,T SERP ( IKP) గంగాధర్, AEO దత్తేశ్వరి,RI హన్మండ్లు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india