V1News Telangana

best news portal development company in india

ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీని కలిసిన ఏనుగు రవీందర్ రెడ్డి వర్గం నాయకులు

SHARE:

V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: పోచారం శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నందుకు నిరసనగా బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి వర్గం నాయకులు సోమవారం రోజు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరు నెలల వ్యవధిలో నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీని పటిష్టంగా చేసిన ఇన్చార్జి ఏనుగు రవీందర్ రెడ్డిని కొనసాగించాలని వారు షబ్బీర్ అలీని కోరారు. గత 35 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ అన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ తట్టుకొని నిలబడినందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాయకుల మరియు కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసేలా పోచారం శ్రీనివాస్ రెడ్డిని అందలం ఎక్కించడం బాధాకరమని వారు వాపోయారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రాకను అధిష్టానం స్వీకరించినప్పటికీ తాము స్వీకరించబోమని నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధిష్టానం పునరాలోచన చేసి సరైన నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో పాత బాలకృష్ణ, సోమశేఖర్ రావ్, మంత్రి గణేష్, విజయ్ కుమార్ (నందు) రెడ్డి, వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india