V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: కామారెడ్డి మండల పరిధిలోని గర్గుల్ గ్రామంలో సోమవారం రోజు విద్యుత్ షాక్ తగిలి గేదె మృతి చెందిన ఘటన వెలుగు చూసింది. గ్రామానికి చెందిన సుదర్శన్ గౌడ్ కు చెందిన పాడి గేదె అని గుర్తించారు. మేత మేసే క్రమంలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ సమీపంలోకి వెళ్లడంతో విద్యుత్ షాక్ తగిలి మృతి చెందిందని స్థానికులు తెలిపారు. గతంలో కూడా ఇదే స్థలంలో రెండు మేకలు చనిపోయినట్లు స్థానికులు తెలియజేశారు. విద్యుత్ శాఖ అధికారులకు పలుమార్లు సమస్యను విన్నవించినప్పటికీ వారు నిర్లక్ష్యంగా పట్టించుకోకపోవడం వలన ప్రమాదం సంభవించిందని గ్రామస్తులు ఆరోపించారు. విద్యుత్ శాఖ ఉన్నత అధికారులు స్పందించి సిబ్బందిపై చర్యలు తీసుకొని.. బాధితుడికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








