V1News Telangana

best news portal development company in india

ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ కొరకు ప్రత్యేక చట్టాన్ని అమలు చేయాలి….

SHARE:

V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా గల ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలలో ఫీజుల నియంత్రణ కొరకు ప్రత్యేక చట్టాన్ని అమలు చేయాలని సోమవారం రోజు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్ వాన్ కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా ఉన్న పాఠశాలలు మరియు కళాశాలలో నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని అన్నారు. విద్యా హక్కు చట్టాన్ని తుంగలో తొక్కి ఇష్టానుసారంగా.. విద్యను వ్యాపారంగా మారుస్తూ లక్షలు, కోట్ల రూపాయలు దండుకుంటున్నారన్నారు. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రత్యేక చొరవతో పాఠశాలలు మరియు కళాశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకొని పేద విద్యార్థులకు విద్యను అభ్యసించడానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india