V1News Telangana

best news portal development company in india

ప్రజావాణి కార్యక్రమంలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన జిల్లా కలెక్టర్…..

SHARE:

V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం రోజు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ మండలాల నుండి వచ్చిన ఫిర్యాదులను ఆయా మండల అధికారులు మరియు డివిజనల్ అధికారుల నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తక్షణ పరిష్కారానికి మార్గం సుగమం చేస్తూ జిల్లా కలెక్టర్ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత సోమవారం రోజు కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కలెక్టర్ కు ప్రజలు నేరుగా వినతులు అందించి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. ప్రజలు కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదులు అందిస్తే తమ సమస్యలు సత్వరంగా పరిష్కారం అవుతాయని వస్తారని అన్నారు. సోమవారం రోజు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 105 ఫిర్యాదులను స్వీకరించినట్లు ఆయన తెలిపారు. శాఖల వారీగా రెవెన్యూ శాఖకు సంబంధించి 68, ఉపాధి కల్పన 2, డిఆర్డిఓ 6, మున్సిపల్ శాఖకు సంబంధించి 2, ఎడి సర్వే 2, బీసీ సంక్షేమ శాఖకు సంబంధించి 2, విద్యుత్ శాఖ సంబంధించి 10, వ్యవసాయ శాఖకు సంబంధించి 2, విద్యాశాఖ 3, అటవీ శాఖ 2, సివిల్ సప్లై 3, డిఎం సివిల్ సప్లై 1, డి ఎం హెచ్ ఓ 1, డిపిఓ 1 వినతులు వచ్చాయని తెలిపారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india