V1 న్యూస్ బాన్సువాడ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: బాన్సువాడ మండలంలోని తిరుమలాపూర్ గ్రామంలో ఘోర సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన రాములు ( 33) అనే వ్యక్తి బాధ్యతలను మరచి.. జులాయిగా తిరుగుతూ నిత్యం అధికంగా మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యను మరియు తండ్రిని కొడుతూ ఇబ్బందులు పెడుతున్నట్లు వారు తెలిపారు. ఈ క్రమంలో అసహనానికి గురైన భార్య మంజుల.. ఆమె ( మామ) భర్త యొక్క తండ్రి నారాయణ తో కలిసి హత్య చేశారు. మృతదేహాన్ని ఇంటి దగ్గర గల సెప్టిక్ ట్యాంక్ లో రెండు రోజులపాటు ఉంచి అనంతరం.. ఇంటి ఆవరణలో గుంత తీసి పాతిపెట్టారు. తరువాత తన భర్త కనబడటం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో అధికంగా దుర్వాసన రావడంతో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆదివారం రోజు సంఘటనా స్థలానికి చేరుకొని భార్య మంజుల మరియు మృతుడి తండ్రి నారాయణను విచారించగా నిత్యం మద్యం సేవించి మమ్మల్ని కొడుతూ చిత్రహింసలకు గురి చేస్తున్నాడని.. అందువల్లనే హత్య చేశామని ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని వెలికి తీయించి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








