V1News Telangana

best news portal development company in india

దాడిలో గాయపడిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పరామర్శించిన ఏనుగు రవీందర్ రెడ్డి…..

SHARE:

V1 న్యూస్ నిజామాబాద్ ప్రతినిధి:

నిజామాబాద్ జిల్లా: నిజామాబాద్ పట్టణంలో గల ప్రభుత్వ ఆసుపత్రిలో నసురుల్లాబాద్ మండలం నెమ్లి గ్రామంలో శనివారం రోజు పొలం విషయంలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన విచక్షణ రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు, ఒక వ్యక్తి కాలు విరిగినట్టు తెలిసింది. తీవ్ర గాయాల పాలై రక్తస్రావంతో ముందుగా బాన్సువాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా అక్కడినుండి వారు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. ఈ క్రమంలో విషయాన్ని తెలుసుకొని ఆదివారం రోజు బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి గాయపడిన వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని వైద్యులకు సూచించారు. దాడి చేసి గాయపరిచిన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయనతో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india