V1News Telangana

best news portal development company in india

మైనారిటీ బాలికల వసతి గృహాన్ని సందర్శించిన సంబంధిత సంక్షేమ అధికారి….

SHARE:

-విద్యార్థినిలకు పౌష్టికాహారం అందించాలి

-వారు తరగతులకు హాజరయ్యే విధంగా చూడాలి

-వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

-మైనారిటీ సంక్షేమ అధికారి దయానంద్ సూచనలు

V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా:కామారెడ్డి పట్టణంలోని మైనారిటీ బాలికల వసతి గృహాన్ని శనివారం రోజు ఇన్చార్జ్ జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి దయానంద్ ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. వసతి గృహంలో గల స్టోర్ రూమ్ ను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఆయన భోజనం చేశారు.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని సూచించారు. వారు తరగతులకు తప్పనిసరిగా హాజరయ్యే విధంగా చూడాలని సిబ్బందికి సూచించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున విద్యార్థులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు ప్రణీత, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india