V1News Telangana

best news portal development company in india

మరణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఏనుగు రవీందర్ రెడ్డి….

SHARE:

V1 న్యూస్ నసురుల్లాబాద్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలం కేంద్రంలో శనివారం రోజు బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ( సోషల్ మీడియా కన్వీనర్) కుటుంబ సభ్యులు గైని రామవ్వ , కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీటీసీ శంకర్ నాయక్ సోదరుడు పెద్ద శంకర్ నాయక్ మరియు రాంపూర్ కృష్ణ అనేవారు మరణించడంతో వారి ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ క్రమంలో మైలారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మేకల ధర్మన్న మాతృమూర్తి ఇటీవల మరణించడంతో వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. వారిని ఓదార్చి మనోధైర్యం ఇచ్చారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వచ్చినట్లు తెలిపారు. అయితే కార్యకర్తలు ఎవరు కూడా మనోధైర్యాన్ని కోల్పోవద్దని ధైర్యాన్నిచ్చారు. గత 35 సంవత్సరాలుగా కార్యకర్తలందరూ పార్టీ కొరకు పనిచేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తూ పార్టీ కొరకు పనిచేయాలని సూచించారు. కార్యకర్తలకు కష్టసుఖాలలో అండగా ఉండాలని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నసరుల్లాబాద్ మండల అధ్యక్షుడు విజయ్ కుమార్ (నందు)రెడ్డి, మాజీ సర్పంచ్ అరిగె సాయిలు, మాజీ ఎంపీటీసీ శంకర్ నాయక్, మైనార్టీ విభాగం మండల అధ్యక్షుడు యూసుఫ్, గ్రామ అధ్యక్షుడు అయినాల లింగం, నాయకులు మంతపురి సాయా గౌడ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india