V1News Telangana

best news portal development company in india

అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధి పనులు, నర్సరీని ఆకస్మికంగా సందర్శించి పరిశీలించిన అదనపు కలెక్టర్…

SHARE:

V1 న్యూస్ నసురుల్లాబాద్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో శుక్రవారం రోజు అదనపు కలెక్టర్( స్థానిక సంస్థల) డి . శ్రీనివాస్ రెడ్డి, మరియు జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావ్ అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధి పనులను మరియు నర్సరీ ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలలో అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చి సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. ఈ క్రమంలో విద్యార్థులకు వడ్డించే మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ప్రభుత్వం సూచించిన మెనూ ప్రకారం నాణ్యతతో కూడిన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని నిర్వాహకులకు మరియు ప్రధానోపాధ్యాయునికి తెలిపారు. పాఠశాల పరిసరాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. మూత్రశాలలు మరియు మరుగుదొడ్లు నిర్మాణము వేగంగా పూర్తి చేసి విద్యార్థులకు వినియోగంలోకి తీసుకురావాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచే విధంగా చర్యలు చేపట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం గ్రామంలో గల నర్సరీని పరిశీలించారు. నర్సరీలో గల మొక్కలకు సమయానికి నీరు ఎరువులు అందించి తగిన జాగ్రత్తలు పాటించి వాటి పెరుగుదలకు కృషి చేసి సంరక్షించాలని తెలిపారు. చనిపోయిన మొక్కల చోట కొత్త మొక్కలను నాటాలన్నారు. కంపోస్టు ఎరువును అధిక మోతాదులో ఉత్పత్తి చేసి మొక్కలకు వినియోగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి నీలావతి, మండల పంచాయతీ అధికారి రాము, APO సౌజన్య, గ్రామపంచాయతీ కార్యదర్శి రాజేష్, TA లు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india