Post Views: 76
V1 న్యూస్ నసురుల్లాబాద్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా నివారణ కొరకు ఆల్బండజోల్ మాత్రలను ఒక సంవత్సరం వయస్సు నుండి 19 సంవత్సరాల లోపు గల పిల్లలకు ఎంపీడీవో నీలావతి మరియు ఎంపీవో రాము ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్న పిల్లలలో నులిపురుగుల ప్రభావం వలన రక్తహీనత, శరీర పెరుగుదలలో లోపాలు తలెత్తుతాయని తెలిపారు. అందువల్ల తల్లిదండ్రులు పిల్లలకు బుల్లి పురుగుల నివారణ మందులు వేయించి వాటిని నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు హన్మండ్లు, CHO,ANM లు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








