V1News Telangana

best news portal development company in india

ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే….

SHARE:

V1 న్యూస్ బాన్సువాడ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను గురువారం రోజు మాజీ శాసనసభ సభాపతి, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. ఈ క్రమంలో నూతనంగా నిర్మిస్తున్న పాఠశాల భవనాన్ని పరిశీలించారు. నూతన భవన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని సదరు గుత్తేదారుకు సూచించారు. విద్యార్థినుల సౌకర్యార్థం నిర్మిస్తున్న మూత్రశాలలు, మరుగుదొడ్లను వేగంగా పూర్తి చేసి అందు బాటులోకి తీసుకురావాలన్నారు. అనంతరం విద్యార్థినుల కొరకు సిద్ధం చేస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థినులతో కాసేపు సంభాషించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు డి. అంజిరెడ్డి, సొసైటీ చైర్మన్ ఎర్వల కృష్ణారెడ్డి, ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india