V1News Telangana

best news portal development company in india

సంవత్సరాలు గడుస్తున్న ఓపెనింగ్కు నోచుకోని నగరపాలక సంస్థ దుకాణాల సముదాయం? … ప్రభుత్వాలు మారిన అధికారులు మారిన పట్టించుకోని అధికారులు పూర్తిస్థాయిలో నిర్మాణం ఎప్పుడు?

SHARE:

సంవత్సరాలు గడుస్తున్న ఓపెనింగ్కు నోచుకోని నగరపాలక సంస్థ దుకాణాల సముదాయం

ప్రభుత్వాలు మారిన అధికారులు మారిన పట్టించుకోని అధికారులు పూర్తిస్థాయిలో నిర్మాణం ఎప్పుడు

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం జూన్ 20:-

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లోని ప్రధాన కూడలిలో నిర్మించిన నగరపాలక దుకాణాల సముదాయం కట్టి సంవత్సరాలు గడుస్తున్న ఓపెనింగ్ కి నోచుకోవడం లేదు. గతంలో నగరపాలక సంస్థ దుకాణాల సముదాయం కాంప్లెక్స్ లో కూరగాయల మార్కెట్ ఉండేది దానిని మార్చి మున్సిపల్ ఆధ్వర్యంలో దుకాణాలకు కాంప్లెక్స్ నిర్మించారు. అయితే అది కేవలం నిర్మాణానికి మాత్రమే పరిమితమైంది. గత మూడు ప్రభుత్వాలు మారిన పూర్తిస్థాయిలో నిర్మాణం పూర్తి కాలేదు దీనిపై ఏ అధికారి కూడా పట్టించుకోవడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రజా ధనంతో కోట్ల రూపాయలు వెచ్చించి సగంలోనే ఆపడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నగర పాలక సంస్థ దుకాణాల సముదాయం నిర్మాణం గత ప్రభుత్వ నాయకులు కాంట్రాక్టర్లు అధికారుల జేబులు నింపినట్లు విశ్వాసనీయమైన సమాచారం. ప్రభుత్వాలు మారిన మున్సిపల్ కమిషనర్లు మారిన పూర్తిస్థాయిలో నిర్మాణం చేపట్టడం లేదని ఆరోపణలు వెలువడుతున్నాయి. అయితే నగరపాలక సంస్థ దుకాణాల సముదాయాన్ని కొందరు యువకులు అసాంఘిక కార్యక్రమాలు మరియు మందుబాబులకు అడ్డాగా మారిందని ప్రజలు మండిపడుతున్నారు. రాత్రి అయితే చాలు మందు బాబులకు ఇతర కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారని స్థానికులు మండిపడునారు. నగరపాలక సంస్థ దుకాణాల సముదాయం పూర్తిస్థాయిలో నిర్మాణం ఎప్పుడు జరుగుతుందని దుకాణదారులు వేచి చూస్తున్నారు. నగరపాలక సంస్థ దుకాణాల సముదాయం శిథిల వ్యవస్థకు చేరుకున్న అధికారులు పట్టించుకోవడం లేదు పూర్తిస్థాయిలో నిర్మాణం కోసం స్థానికులు వేచి చూడాల్సిందేనా అని ప్రజలు అడుగుతున్నారు. ఈ ప్రభుత్వంలో ఉన్న ప్రజా ప్రతినిధులు ఆధ్వర్యంలో ఆయన పూర్తిస్థాయి నిర్మాణం అవుతుందని ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై కలెక్టర్ ఇప్పుడున్న ప్రభుత్వ ప్రజాతినిధులు మున్సిపల్ కమిషనర్ అధికారులు స్పందించి పూర్తిస్థాయిలో నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

best news portal development company in india