V1News Telangana

best news portal development company in india

“నులి”పేద్దాం….

SHARE:

V1 న్యూస్ బీర్కూర్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: ఉమ్మడి బీర్కూర్ మండలంలో గల అంగన్వాడి సెంటర్లలో, ప్రభుత్వ , ప్రైవేటు పాఠశాలలు మరియు కళాశాలలో గురువారం రోజు జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల వైద్యాధికారి డాక్టర్ గిరీష్ ఆధ్వర్యంలో ఒక సంవత్సరం వయసు నుండి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఆల్బండజోల్ మాత్రలు వేశారు. ఈ సందర్భంగా డాక్టర్ గిరీష్ మాట్లాడుతూ నులిపురుగుల ప్రభావం వలన పిల్లలలో రక్తహీనత, జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయని తెలిపారు. వాటి ప్రభావం వలన పిల్లలలో ఎదుగుదల లోపించి, జ్ఞాపకశక్తి కూడా కోల్పోయే ప్రమాదం ఉందని అందువల్ల ప్రతి ఒక్కరూ పిల్లలకు ఆల్బండ జోల్ మాత్రలు వేయించి నులిపురుగుల నివారణకు కృషి చేయాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో CHO రవీందర్, సూపర్వైజర్లు, ANM లు, ఆశా వర్కర్లు, అంగన్వాడి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india