V1News Telangana

best news portal development company in india

శనివారం రోజు గరుడ వాహనంపై స్వామివారి రథోత్సవం

SHARE:

V1 న్యూస్ బీర్కూర్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: బీర్కూర్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో గల తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానంలో జూన్ 22వ తేదీన శనివారం రోజు పౌర్ణమి సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రాత:కాల సమయంలో అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయని ఆలయ కమిటీ సభ్యులు పత్రిక ప్రకటన ద్వారా తెలియజేశారు. మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందన్నారు. సాయంత్రం ఏడు గంటలకు ఆలయ మాడవీధులలో గరుడవాహనంపై స్వామివారి రథోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు. దైవిక కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆలయ కమిటీ విజ్ఞప్తి చేస్తున్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india