V1News Telangana

best news portal development company in india

ఆలయ ప్రాంగణంలో అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

SHARE:

ఆలయ ప్రాంగణంలో అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

V1 న్యూస్ నసురుల్లాబాద్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా:నసురుల్లాబాద్ మండలంలోని మైలారం గ్రామంలో గల కొచ్చరి మైసమ్మ ఆలయం వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయం వద్ద కోటి 60 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న వసతి గృహాలను మరియు 40 లక్షల వ్యయంతో నిర్మాణం చేస్తున్న సిసి రోడ్ పనులను వేగవంతంగా జరుగుతున్నాయని ఆయన హర్షం వ్యక్తం చేశారు. అమ్మవారి సన్నిధికి భక్తుల సంఖ్య పెరగడంతో నిధులను కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఎంపీపీ విట్టల్, జిల్లా కోఆప్షన్ నెంబర్ మాజీద్ ఖాన్, నాయకులు రాము, ప్రతాప్, జగన్, తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india