V1News Telangana

best news portal development company in india

కాంగ్రెస్ పార్టీలోనికి రానివ్వం

SHARE:

కామారెడ్డి జిల్లా:బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి రానివ్వమని నసురుల్లాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ (నందు) రెడ్డి అన్నాడు. బుధవారం రోజు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎటు పల్లం ఉంటే అటు పారే స్వభావం ఉందని అందుకే ఆయన అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి రావాలని అనుకుంటున్నారని అన్నారు. గతంలో కూడా టిడిపి, టిఆర్ఎస్ పార్టీలోకి వలసలు వెళుతూ పబ్బం గడుపుకున్న వ్యక్తిత్వం ఆయనదని దూషించారు. గత వారం పది రోజుల నుండి వివిధ పత్రికల్లోనూ, సామాజిక మాధ్యమాలలోనూ ఆయన కాంగ్రెస్ పార్టీలోకి చేరుతారని వస్తున్నా వార్తలను పోచారం శ్రీనివాస్ రెడ్డి ఖండించకపోవడం పట్ల ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటాడు అనడానికి బలమైన నిదర్శనమని ఆయన ఆరోపించారు. కేవలం వారి స్వప్రయోజనాల కొరకు మాత్రమే కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నారని ఆయన్ని కాంగ్రెస్ పార్టీలోకి రాకుండా చూస్తామని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రధాన రహదారిపై పోచారం శ్రీనివాస్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు, వివిధ గ్రామాల అధ్యక్ష, కార్యదర్శులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india