V1News Telangana

best news portal development company in india

వి1 న్యూస్ ఎఫెక్ట్ గోదావరిఖనిలో 42 ట్రాక్టర్ల అక్రమ ఇస్కాను పోలీసులు స్వాధీనం… రామగుండంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న అక్రమ ఇసుకపై వి1 న్యూస్ కథనానికి స్పందన.

SHARE:

వి1 న్యూస్ ఎఫెక్ట్ గోదావరిఖనిలో 42 ట్రాక్టర్ల అక్రమ ఇస్కాను పోలీసులు స్వాధీనం

రామగుండంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న అక్రమ ఇసుకపై వి1 న్యూస్ కథనానికి స్పందన

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం జూన్ 19:-

బుధవారం గోదావరిఖని ఒకటో పట్టణ పోలీసుల ఆకస్మిక తనిఖీలలో భాగంగా గోదావరిఖని ఓసిపి ఫోర్ రోడ్డు వద్ద అక్రమంగా నిల్వవించిన 42 ట్రాక్టర్ లోడ్ల ఇసుకను గుర్తించి వెంటనే ఈ విషయం రెవిన్యూ అధికారులకు తెలుపగా వారు వచ్చి 42 ఇసుక డంపింగ్లను స్వాధీనం చేసుకుని తరలించినట్లు సమాచారం. రామగుండం గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో ఎవరైనా నూతన గృహం నిర్మించుకునే వారు ప్రభుత్వం సరఫరా చేసే ఇసుక పాలసీ నందు బుక్ చేసుకొని తీసుకోవాల్సిందిగా మనవి చేశారు. అలానే గోదావరిఖని ఒకటో పట్టణ పరిధిలో ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేసిన ట్రాక్టర్లను లేదా లారీలను సీజ్ చేసి డ్రైవర్ల మీద మరియు అట్టి వాహనాల యజమానుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి వాహనాలను జప్తు చేసి కోర్టుకు డిపాజిట్ చేయడం జరుగుతుందని తెలిపినారు. దీనిపై స్పందించిన అధికారులకు వి1న్యూస్ తరఫున కృతజ్ఞతలు.

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

best news portal development company in india