Post Views: 53
V1 న్యూస్ బీర్కూర్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: బీర్కూర్ మండలంలోని బైరాపూర్ గ్రామంలో బుధవారం రోజు లయన్స్ క్లబ్ బీర్కూర్ ఆధ్వర్యంలో కంటి వైద్య నిపుణుడు సతీష్ పర్యవేక్షణలో ప్రజలకు ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. గ్రామ ప్రజలు పలువురు కంటి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ క్రమంలో 58 మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించగా.. 18 మందికి దృష్టిలోపం ఉన్నట్లు డాక్టర్ నిర్ధారించారు. ఈ కార్యక్రమంలో కంటి వైద్య నిపుణుడు సతీష్, పల్లె దవాఖాన MLHP ప్రీతి, లయన్స్ క్లబ్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, ఆరోగ్య కార్యకర్తలు ఝాన్సీ, కావ్య, తదితరులు పాల్గొన్నారు.

Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..