V1News Telangana

best news portal development company in india

అక్రమ ఇసుక దందా అధికారులకు కనబడడం లేదా?.. రాత్రి మొదలు పొద్దటి వరకు వందల సంఖ్యలో ఇసుక ట్రాక్టర్లు రవాణా?

SHARE:

అక్రమ ఇసుక దందా అధికారులకు కనబడడం లేదా?

రాత్రి మొదలు పొద్దటి వరకు వందల సంఖ్యలో ఇసుక ట్రాక్టర్లు రవాణా?

అక్రమ ఇసుక దందాపై అధికారుల చర్య ఉంటుందా?

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం జూన్ 19:-

గోదావరిఖని లోని గోదావరి సాక్షిగా ఇసుక దందా గుట్టు చప్పుడు కాకుండా నడుస్తుందని విశ్వసనీయమైన సమాచారం. యదేచ్ఛగా గోదావరిలో డాక్టర్లు నడవడానికి పెద్దపైపులు వేసుకోని మరి ఇసుక రవాణా కొనసాగిస్తున్నారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే పెద్ద పైప్లైన్ వేసి మరి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారంటే ఏ మేరకు ఇసుక దందా నడుస్తుందో ఇట్టే అర్దం అవుతుంది. స్థానిక ఒక ప్రజాప్రతినిధి అండదండలతో ప్రతిరోజు అక్రమ ఇసుక రవాణా కొనసాగుతున్నప్పటికీ ఏ అధికారికి ఈ విషయం తెలియదా అని పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాత్రి పూట గోదావరిలో జెసిబి ఏర్పాటు చేసి వందల కొద్ది ట్రాక్టర్లు ఇసుక రవాణా చేసి గోదావరిఖని లో కొన్ని చోట్ల డంపుల్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. గోదావరిలో రాత్రి పూట ఇంత జరుగుతున్న ఏ అధికారికి తెలియకపోవడం ఆశ్చర్యకరం. ఇప్పటికైనా రామగుండం సి.పి. ఇసుక దందపై స్పందించి చట్టరీత్య చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఖనిలో ఇంత జరుగుతున్న రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదా లేక తెలిసిన చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నార. అనే ప్రశ్నలు వెలువడుతున్నాయి. ఏది ఏమైనా వందల కొద్ది టాక్టర్లతో ఇసుక దందా అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ రెవెన్యూ అధికారులు పోలీస్ సిబ్బంది స్పందించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

best news portal development company in india