V1News Telangana

best news portal development company in india

నీట్( NEET)పరీక్షలో జరిగిన అవినీతిని విచారణ కమిటీ వేసి బయటపెట్టాలి

SHARE:

ఫస్ట్ ర్యాంక్ అంత మందికి ఎలా వస్తుంది..?

నిష్పక్షపాతమైన విచారణ జరిపి తగిన చర్యలు తీసుకొని నీట్ పరీక్ష మళ్ళీ నిర్వహించాలి

తెలుగు నాడు స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు పుట్ట భాస్కర్ డిమాండ్

V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా:ప్రతి సంవత్సరం (NEET) పరీక్షను NTA ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది .ఈ పరీక్షను ఇతర దేశస్థులు కూడా రాస్తారు..ఇంటర్ తర్వాత పాస్ అయినటువంటి విద్యార్థులు (MBBS మరియుBDS) సంబంధిత ఇతర కోర్సులలో చేరేందుకు ఈ పరీక్షను రాస్తారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఈ పరీక్షలను NTA నిర్వహించింది. అయితే ఈ పరీక్ష యొక్క ఫలితాలను అనుకున్న తేదీ కంటే ముందుగానే విడుదల చేసింది. అప్పటి నుండి ఈ పరీక్ష మీద అనేక అనుమానాలు మొదలయ్యాయి. ఏకంగా 60 మందికి పైగా విద్యార్థులకు మొదటి ర్యాంకును ఇవ్వటం జరిగింది.ఇప్పటివరకు ఒక్కరూ లేదా ఇద్దరికీ మాత్రమే మొదటి ర్యాంకులు వచ్చేవి.. అలాంటిది ఈసారి ఏకంగా 60 మందికి పైగా మొదటి ర్యాంకు రావడంతో పలు అనుమానాలకు తావిస్తుంది. దీనికి తోడు ఒకే సెంటర్లో నిర్వహించిన పరీక్షలోఏకంగా 8 మందికి ఫస్ట్, సెకండ్ ర్యాంకులు రావడం జరిగింది. ఈ అనుమానాలకి ఈ ర్యాంకులు బలాన్ని చేకూర్చాయి.. ఇలా ఒకే సెంటర్లో అనేకమందికి ర్యాంకులు రావడం ఇదే మొదటిసారి..ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్ని తలకిందులు గానే ఉన్నాయి.. జూన్ 14న విడుదల కావలసిన పరీక్ష ఫలితాలను ముందస్తుగా జూన్ 4 న విడుదల చేశారు . అదే రోజు దేశంలో కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్వహించినటువంటి ఎన్నికల ఫలితాలు కూడా విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఎవరు కూడా ఈ నీట్ (NEET ) పరీక్ష ఫలితాల మీద అంతగా ఫోకస్ చేయలేకపోయారు. నీట్ ఫలితాలు వెలుడైన తర్వాత రోజులు గడిచేకొద్దీ అనేకమంది విద్యార్థులు వారికి జరిగిన అన్యాయం గురించి ఒక్కొక్కరుగా బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. ఇదిలా కొనసాగుతూ దేశవ్యాప్తంగా నిరసనలు కూడా మొదలయ్యాయి.. కొంతమంది విద్యార్థులు వారికి వచ్చిన ఫలితాలపై అనుమానం వచ్చి కోర్టును ఆశ్రయించారు. కౌన్సిలింగ్ ప్రక్రియ ఆపాలని విద్యార్థులు కోరినప్పటికీ కోర్టు ఆపడానికి వీళ్లేదంటూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ తీర్పు తర్వాత దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళన, నిరసనలు మొదలయ్యాయి.. ఈ నిరసనలకి దేశంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నీట్ విద్యార్థులకి ఎలాంటి ఆదరణ లభించడం లేదు.. ఎన్నో కలలు కని పరీక్ష కోసం సిద్ధమై పరీక్ష రాసిన విద్యార్థులకు వారికి సహకరించిన తల్లిదండ్రులకు చివరకు నిరాశే మిగిలింది.
ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పరీక్ష నిర్వహించినటువంటి అధికారుల పైన విచారణ జరిపి ఏవైనా తప్పులు చేసినటువంటి అధికారుల పైన చర్యలు తీసుకొని..నిరుపేద విద్యార్థులకు న్యాయం చేయాలని తెలుగు నాడు విద్యార్థి సంఘం తరఫున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను పుట్ట భాస్కర్ కోరుతున్నామన్నాడు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india