Post Views: 73
కామారెడ్డి జిల్లా: బీర్కూర్ మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం రోజు మహిళ ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మహిళలకు గర్భసంచి సమస్యలు, రొమ్ము క్యాన్సర్ వ్యాధి, గొంతు క్యాన్సర్, రక్తహీనత, థైరాయిడ్ సమస్యలు మరియు తదితర వ్యాధులకు సంబంధించిన వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందించారు. మందులు పంపిణీ చేసి, వ్యాధి నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎం.ఎల్.హెచ్.పి లు స్వాతి మరియు ప్రీతి, సూపర్వైజర్లు నర్సమ్మ, సుశీల, గ్రామానికి చెందిన మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








