V1News Telangana

best news portal development company in india

బక్రీద్ పండుగను ఘనంగా నిర్వహించుకున్న ముస్లిం సోదరులు…..

SHARE:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో సోమవారం రోజు బక్రీద్ పండుగను పురస్కరించుకొని ముస్లిం సోదరులు నూతన వస్త్రాలు ధరించి ఈద్గా వద్ద అందరూ ఒక వద్దకు చేరి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మైనారిటీ విభాగం మండల అధ్యక్షుడు యూసుఫ్ మాట్లాడుతూ ఈ పండుగను ఇబ్రహీం అలై సలాం కుమారుడైన ఇస్మాయిల్ అలై సలాం ను స్ఫూర్తిగా తీసుకొని ఈద్ ఉల్ అధ (బక్రీద్) పండగను జరుపుకుంటామని ముస్లిం సోదరులు తెలిపారు. త్యాగానికి ప్రతీకగా ప్రపంచవ్యాప్తంగా బక్రీద్ పండుగను మనుషులు చేసిన పాపాల నుండి విముక్తిని పొందడానికి సరైన మార్గంలో ప్రజలు జీవించడానికి జరుపుకుంటారని తెలిపారు. ఈ పండుగ సందర్భంగా వారి పూర్వీకులను స్మరించుకుంటూ వారి సమాధుల వద్ద పువ్వులు మరియు పండ్లతో ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఒకరినొకరు ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ అరిగె సాయిలు, మాజీ ఎంపిటిసి కంది మల్లేష్ పాల్గొని ముస్లిం సోదరులకు పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామంలోని ముస్లిం సోదరులు పెద్దలు పిల్లలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india