V1News Telangana

best news portal development company in india

పోలీసులు న్యాయం చేయడం లేదని సెల్ ఫోన్ టవర్ పైకెక్కి ఆత్మహత్యాయత్నం చేసి నిరసన తెలిపిన యువకుడు…..

SHARE:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలంలోని బొమ్మందేవ్ పల్లి గ్రామానికి చెందిన ఆలకుంట శేఖర్ (29)అనే యువకుడు శుక్రవారం రోజు గ్రామంలో గల సెల్ ఫోన్ టవర్ పైకెక్కి ఆత్మహత్య చేసుకుంటానని నిరసన తెలిపిన సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే బాధితుడి భార్య రజిత, సోమేశ్వర్ గ్రామానికి చెందిన హన్మండ్లు తో వివాహేతర సంబంధం కలిగి ఉండడం వలన వారు పారిపోతున్న క్రమంలో వారిని వెంబడించి పట్టుకోవడానికి ప్రయత్నించగా అతనిపై విఛక్షణ రహితంగా దాడి చేశారని తెలిపాడు. తనపై దాడి చేసే క్రమంలో అతని భార్య హన్మండ్లు అనే వ్యక్తికి, అతని పై దాడి చేయడానికి రాడ్డు చేతికి అందించి ఉసిగొలిపిందని తెలిపాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ప్రాణాలను అర చేతిలో పెట్టుకొని స్థానికుల సహకారంతో బ్రతికి బయటపడ్డానని తెలిపాడు. ఈ క్రమంలో నిజామాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి. మరుసటి రోజు నసురుల్లాబాద్ పోలీస్ స్టేషన్లో కూడా మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. జూన్ 25వ తేదీన నిజామాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్లో, జూన్ 26వ తేదీన నసురుల్లాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి నేటికి 20 రోజులు గడిచినప్పటికీ ఇప్పటివరకు పోలీసుల నుండి ఎటువంటి సమాచారం (ఆచూకీ) అందలేదని, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నాడు. తన భార్య రజిత తో పాటు కుమారుడు మరియు కూతురు ఇద్దరినీ కూడా తీసుకువెళ్లారని, పదే పదే తన పిల్లలు గుర్తుకు రావడం వలన భోజనం సహించడం లేదని, ఆవేదన వ్యక్తం చేశాడు. తన పిల్లలను వారు ఉంచుతారో, చంపుతారోనని పితృ ప్రేమతో అనుక్షణం భయభ్రాంతులకు గురవుతున్నానని తెలిపాడు. పోలీసులు స్పందించకపోవడం, ఈ క్రమంలో తన తల్లి కూడా అతనిపై అసహనం వ్యక్తం చేయడంతో తీవ్ర మనస్థాపానికి గురై సెల్ ఫోన్ టవర్ పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలియజేశాడు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india