V1News Telangana

best news portal development company in india

గ్రూప్ ఆఫ్ హెల్పింగ్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో, మెడి కవర్ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహణ…..

SHARE:

కామారెడ్డి జిల్లా: నసుల్లాబాద్ మండలంలోని మైలారం గ్రామంలో శుక్రవారం రోజు గ్రూప్ ఆఫ్ హెల్పింగ్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో మెడి కవర్ హాస్పిటల్ వారి సహకారంతో సంయుక్తంగా ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రూప్ ఆఫ్ హెల్పింగ్ వ్యవస్థాపకులు హరీష్ రాథోడ్ మాట్లాడుతూ వర్షాకాలం మొదలవుతున్న సందర్భంగా ప్రజలకు విష జ్వరాలు ,అంటువ్యాధులు ప్రబలకుండా అవగాహన కల్పించడానికి మరియు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి బిపి, షుగర్ ఉన్నవారికి రక్త పరీక్షలు నిర్వహించామని తెలిపారు. పేద ప్రజలకు వైద్య సహాయం అందించడానికి ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మోహన్ ఆధ్వర్యంలో రక్త పరీక్షలు నిర్వహించి వైద్యం అందించారు. అవసరమైన వారికి ఈసీజీ పరీక్షలు నిర్వహించారు.హెల్త్ క్యాంప్ లో దాదాపుగా 250 మంది వరకు పాల్గొన్నారు. అందులో 15 మందికి ఈసీజీ పరీక్షలు నిర్వహించారు. అందరికీ షుగర్ పరీక్షలు నిర్వహించగా 18 మందికి షుగర్ వ్యాధి ఉన్నట్లుగా గుర్తించారు. అందరికీ బీపీ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రూప్ ఆఫ్ హెల్పింగ్ ఫ్రెండ్స్ అధ్యక్షుడు సురేష్, శ్రీకాంత్, మైలారం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేందర్ గౌడ్, గ్రామస్తులు, సాయ గౌడ్, దూళి చిన్న గంగారం, పెరిక సాయిలు, అల్లం మైసయ్య తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india