V1News Telangana

best news portal development company in india

మహిళా సమాఖ్య పనితీరును అభినందించిన అస్సాం అధికార బృందం…..

SHARE:

కామారెడ్డి జిల్లా: భిక్కనూర్ మండలంలోని మహిళా సమాఖ్య పనితీరును అస్సాం అధికార బృందం అభినందించింది. గురువారం రోజు అస్సాం రాష్ట్రానికి చెందిన వివిధ శాఖల అధికారులు మండల కేంద్రంలో గల మహిళా సమాఖ్య కార్యాలయాన్ని సందర్శించారు. మహిళా సమాఖ్య ద్వారా డ్వాక్రా సంఘాలకు అందిస్తున్న రుణాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. బ్యాంకు లింకేజీ రుణాలు, జీవనోపాధి తదితర అంశాలపై అస్సాం బృందం అధ్యయనం చేసింది. డ్వాక్రా సంఘాలు మరింత బలోపేతం కావలసిన అవసరం ఎంతైనా ఉందని వారు సూచించారు. మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను మహిళలు వినియోగించుకుని అందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు మహిళలకు అందించడం వలన ఆర్థిక పురోగతి సాధిస్తారని అన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india