Post Views: 75
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలంలోని సంగం గ్రామంలో ప్రజలకు విష జ్వరాలు సంక్రమించిన నేపథ్యంలో గత రెండు రోజులుగా మండల వైద్యాధికారి ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఉచిత వైద్య శిబిరంలో భాగంగా గురువారం రోజు గ్రామ ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. అంతేకాకుండా గ్రామంలోని వీధులన్నీ తిరుగుతూ మురికి కాలువల్లో, వీధుల వెంట నిలిచి ఉన్న రోడ్ల పైన “తీమోఫాస్” ద్రావణాన్ని పిచికారి చేయించారు. గ్రామంలో గల ప్రతి వాటర్ ట్యాంక్ ని క్లోరినేషన్ చేయించి శుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామ పంచాయతీ కార్యదర్శికి డాక్టర్ గిరీష్ సూచించారు. ఈ కార్యక్రమంలో సి.హెచ్.ఓ రవీందర్, పంచాయతీ కార్యదర్శి అనిల్, ఆశా వర్కర్లు, ఏఎన్ఎం లు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








