V1News Telangana

best news portal development company in india

మిషన్ భగీరథ కుళాయిల ఇంటింటి సర్వే నిర్వహించిన పంచాయతీ కార్యదర్శి…..

SHARE:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో బుధవారం రోజు గ్రామపంచాయతీ కార్యదర్శి రాజేష్ ఇంటింటికి తిరుగుతూ మిషన్ భగీరథ కుళాయిల సర్వే నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామంలో మిషన్ భగీరథ కార్యక్రమానికి సంబంధించి ఎన్ని కుళాయిలు ఉన్నాయని విషయంపై సర్వే నిర్వహించి వివరాలు ఆన్ లైన్ లో పొందుపరిచారు. ఈ క్రమంలో మంచినీటి సరఫరా సక్రమంగా జరుగుతుందా లేదా అన్న విషయాన్ని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. నీటి సరఫరా జరగని ప్రదేశాలు ఉన్నట్లయితే వాటి సమస్యను పరిష్కరించి మంచినీటి సరఫరా జరిగే విధంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india