V1News Telangana

best news portal development company in india

ప్రభుత్వ ఏకరూప దుస్తుల తయారీని పరిశీలించిన ఎంపీడీవో బషీరుద్దీన్…..

SHARE:

కామారెడ్డి జిల్లా: బాన్సువాడ మండలంలోని తాడ్కోల్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థినీ, విద్యార్థులకు ఉచితంగా అందించే ఏకరూప దుస్తుల తయారీ కేంద్రాన్ని మంగళవారం రోజు ఎంపీడీవో బషీరుద్దీన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఉచితంగా దుస్తులు మరియు పాఠ్యపుస్తకాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలన్నారు. పాఠశాలల పునః ప్రారంభం సమీపిస్తున్నందున దుస్తులు కుట్టు పనులను నాణ్యతతో వేగంగా, త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి ప్రశాంతి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india