V1News Telangana

best news portal development company in india

బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రచారం నిర్వహిస్తున్న ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు…..

SHARE:

*బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రచారం నిర్వహిస్తున్న ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు*…..

-తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించాలి

-ఎం.పీ.పీ పాల్త్యా విఠల్

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలంలోని సంగం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే “బడిబాట” కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడానికి , ఎంపీపీ పాల్థ్యా విఠల్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల సిబ్బంది ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, గ్రామంలో ఇంటింటికి పర్యటించి విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి పాఠశాలలో విద్యార్థులకు గతంలో ఎన్నడు లేని విధంగా మౌలిక వసతుల కల్పన, పాఠశాలల ఆధునీకరణ చేపట్టి అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తీర్చిదిద్దారని తెలిపారు. అత్యున్నత అర్హతలు మరియు బోధన అనుభవం గల ఉపాధ్యాయులచే విద్యాబోధన, సకల హంగులతో ప్రభుత్వ పాఠశాలలు, భద్రతాపరమైన ప్రహరీ గోడలు నిర్మించామని తెలిపారు. విశాలమైన తరగతి గదులలో ప్రశాంతమైన వాతావరణంలో విద్యాబోధన చేయబడుతుంది అని తెలిపారు. విద్యార్థులకు అధునాతనమైన డ్యూయల్ డెస్క్ బెంచీలు సౌకర్యం ప్రభుత్వం కల్పించిందన్నారు. ఉన్నత విద్యాభ్యాసం కొరకు ఫ్లాట్ ప్యానల్స్ చే డిజిటల్ విద్యాబోధన ఉంటుందని అన్నారు.తెలుగు మరియు ఇంగ్లీష్ పాఠ్య పుస్తకాలు ఉచితంగా ఇవ్వబడతాయని తెలిపారు, రెండు జతల ఉచిత ఏకరూప పాఠశాల దుస్తులు, ఉచిత మధ్యాహ్న భోజన పథకం, గ్రంథాలయ సౌకర్యం, ఆధునిక సైన్స్ ప్రయోగశాలలు, పిల్లల యొక్క విద్య మరియు క్రమశిక్షణ విషయంలో వారి తల్లిదండ్రులతో నెలవారి సమావేశాలు నిర్వహించడం, విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ,ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన, మరియు వృత్తి విద్య నైపుణ్య శిక్షణ తరగతులు, విశాలమైన క్రీడా ప్రాంగణంలో విద్యార్థులకు ఆసక్తిగల క్రీడలలో ప్రావీణ్య శిక్షణ, కంప్యూటర్ తరగతులు, ఆంగ్ల భాష పై పరిజ్ఞానం కొరకు ప్రత్యేకత తరగతుల నిర్వహణ, మొదలగు అంశాల గురించి అవగాహన కల్పిస్తూ ప్రచారం నిర్వహించారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు హరి, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india