V1News Telangana

best news portal development company in india

అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి…..

SHARE:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలం దుర్కి గ్రామ శివారులో గల అటవీ ప్రాంతంలో మంగళవారం రోజు అనుమానాస్పద స్థితిలో మరణించిన వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ఘటన స్థలాన్ని పరిశీలించగా పోలీసుల రికార్డులో నమోదైన ఆచూకీ దొరకని వారందరికీ సమాచారం అందించారు. ఈ క్రమంలో దుర్కి గ్రామానికి చెందిన మావురం బలరాం(35) గత నెల 29 నుండి కనబడడం లేదని అతని భార్య మంజుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మంజులకు సమాచారం అందించగా ఘటన స్థలాన్ని పరిశీలించి మృతుడు అతని భర్తనే అని గుర్తించి నిర్ధారణ చేయడంతో శవాన్ని పోస్టుమార్టం నిర్వహించి అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు కేసు నమోదు చేసుకున్నారు. మృతుడి మృతదేహం పూర్తిగా కాలిపోయి ఉండడం వలన ఎవరైనా హత్య చేసి ఉంటారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నట్లు స్థానికులు తెలిపారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india