V1News Telangana

best news portal development company in india

పేరుకే పెద్ద ఆసుపత్రి కనీసం సరైన సదుపాయం కరువు 

SHARE:

ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు సరైన సదుపాయాలు లేవు

పేరుకే పెద్ద ఆసుపత్రి కనీసం నీళ్లు తాగడానికి కూడా సదుపాయం లేదు

రోగులకు సరైన సమయానికి అన్నం అందించని వైన్యం

మమ్మల్ని పట్టించుకునేది ఎవరు? మొరపెట్టుకుంటున్న రోగులు

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం జూన్ 11:-

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో గత కొద్ది రోజులుగా రోగులకు మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ నైట్ డిన్నర్ సరైన సమయానికి అందించడం లేదని పలువురు రోగులు వాపోతున్నారు. ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కు పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన రోగులు చాలా ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చి వైద్యం తీసుకుంటున్నారు అయితే అడ్మిట్ అయిన రోగులకు సరైన సదుపాయాలు కల్పించకపోవడం త్రాగునీటి వసతులు లేకపోవడంపై మండిపడుతున్నారు. ప్రభుత్వ జనరల్ హాస్పటల్లో జరుగుతున్న ఇలాంటి తంతు అధికారులకు తెలియజేసినప్పటికీ వారి ప్రవర్తన మారడం లేదు. ఇతర ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స చేయించుకోలేని పేద కుటుంబాలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కి వచ్చి వైద్యం చేయించుకుంటున్నారు. అయితే కనీసం సరైన సదుపాయాలు లేకపోవడంతో అసంతృప్తి చెందుతున్నారు. ఎవర్ని అడిగినా కూడా మాకు సంబంధం లేదన్నట్లు సమాధానం చెబుతున్నారని పలువురు రోగుల కుటుంబాలు మండిపడుతున్నారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే మరియు జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులు స్పందించి వెంటనే రోగులకు సరైన సమయానికి వసతులు కల్పించాలని ప్రజలు విన్నపించుకుంటున్నారు.

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

best news portal development company in india