V1News Telangana

best news portal development company in india

*విద్యాశాఖ అధికారుల నుండి అనుమతులు లేకుండా ప్రచారం కొనసాగిస్తున్న ఇండియన్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం*…..

SHARE:

*విద్యాశాఖ అధికారుల నుండి అనుమతులు లేకుండా ప్రచారం కొనసాగిస్తున్న ఇండియన్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం*…..

-అనుమతులు లేకున్నా అడ్మిషన్ల స్వీకరణ

-అనుమతులు వచ్చాయంటూ సోషల్ మీడియా,వాట్సాప్ గ్రూప్ లల్లో జోరుగా ప్రచారాలు

-చూసి చూడనట్లుగా వ్యవహారిస్తున్న మండల, జిల్లా విద్యాశాఖ అధికారులు

-(A.I.S.B) జిల్లా అధ్యక్షుడు బైరాపూర్ రవీందర్ గౌడ్ డిమాండ్

V1 న్యూస్ ఎల్లారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా : సదశివానగర్ మండలం కేంద్రంలో ఉన్న ఇండియన్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం జిల్లా మరియు మండల విద్యాశాఖ అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా జోరుగా ప్రచారాలు కొనసాగిస్తూనరాని
(A.I.S.B) ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ జిల్లా అధ్యక్షుడు బైరాపూర్ రవీందర్ గౌడ్ తెలిపారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సదశివానగర్ మండల కేంద్రంలో ఉన్న ప్రైవెట్ పాఠశాలకు జిల్లా విద్యాశాఖ అధికారుల నుండి ఎలాంటి అనుమతులు లేకుండానే ఇండియన్ పబ్లిక్ స్కూల్ పేరుతో అడ్మిషన్లు ప్రారంభిస్తూ, సోషల్ మీడియాలో,వాట్సాప్ గ్రూప్ లల్లో ప్రచారాలు కొనసాగిస్తూ కరపత్రాలతో, భారీ హోర్డింగ్ లతో,ఫ్లెక్సీలతో విద్యార్థుల తల్లి, తండ్రులను మభ్య పెడుతూ, మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ విషయంపై సదశివానగర్ మండల విద్యాశాఖ అధికారిని ఫోన్ లో వివరణ కోరగా సదాశివానగర్ మండల కేంద్రంలోని ఇండియన్ పబ్లిక్ స్కూల్ కి ఎలాంటి అనుమతులు ఇవ్వ లేదని,జిల్లా విద్యాశాఖ మండల విద్యాశాఖ కార్యాలయం నుండి ఆ పాఠశాలకు ఎటువంటి ధ్రువీకరణ అనుమతి ఇవ్వలేదని వారు తెలిపారని అన్నారు. వెంటనే ఈ ప్రైవెట్ పాఠశాల యాజమాన్యంపై జిల్లా విద్యాశాఖ అధికారులు, జిల్లా ఉన్నత అధికారులు తగ్గిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.లేనిపక్షంలో (A.I.S.B) విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india