V1News Telangana

best news portal development company in india

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో డీజిల్ పెట్రోల్ అవినీతి నెలలు గడుస్తున్న పట్టించుకోని అధికారులు 

SHARE:

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో డీజిల్ పెట్రోల్ అవినీతి నెలలు గడుస్తున్న పట్టించుకోని అధికారులు

చేతివాటం చూపిస్తున్న అవినీతి అధికారులు లక్షల్లో కుంభకోణం

రోజుకు మూడు ట్రిప్పుల రాసి ఒక ట్రిప్పు మాత్రమే వాడుతున్న పైనం

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం జూన్ 07:-

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో గత కొన్ని నెలలుగా జరుగుతున్న అవినీతి ఏ అధికారి పట్టించుకోవడంతో చేతివాటం చూపిస్తున్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో 50 డివిజన్లు ఉన్నాయి అయితే 50 డివిజన్లో చెత్త సేకరణ బండ్లు కొన్ని మాత్రమే వాడుతున్నారు మిగతావి వాడకపోయినా వాడుతున్నట్లు చలామణి అవుతున్నాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చెత్త సేకరణకు ఏర్పాటుచేసిన చెత్త వాహనాలు వారం రోజులు గడిచినా కూడా చెత్త తీసుకుపోవడానికి రాకపోవడంతో కొన్ని ప్రాంతాల డివిజన్ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని వాపోతున్నారు. ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ కొంతమంది చెత్త సేకరణకు ఏర్పాటు చేసిన అధికారులు గతంలో మాదిరిగానే చేతివాటం చూపిస్తున్నట్లు పలువురు కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే చెత్తను సేకరించే ప్రధాన వాహనాలకు డిజీల్, పెట్రోల్ కొట్టించే విషయంలో తన పాత బుద్ధి చూపిస్తున్నాడని విశ్వసనీయమైన సమాచారం. రోజుకో ప్రాంతంలో మూడు ట్రిప్పులు కొట్టే చెత్త సేకరణ వాహనాలను ఏకంగా ఒకట ట్రిప్ నడిపిస్తూ మిగిలిన డీజిల్, పెట్రోల్ ను పక్కదారి పట్టిస్తున్నాడని పేర్కొన్నారు. డివిజన్లో చెత్తతో ప్రజలు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు ప్రతిరోజు డివిజన్‌ లలో ఇదే తంతు జరుగుతుందని ఆరోపించారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు చొరవ తీసుకొని ఇలాంటి అధికారుల పట్ల దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. అవినీతి అధికారులపై విజిలెన్స్ ఎంక్వయిరీ జరిపించాలని డిమాండ్ చేశారు. చెత్త సేకరణ ఆలస్యం అయినా బిల్లులు మాత్రం యధావిధాంగా తీసుకుంటున్నట్లు సమాచారం . అదేవిధంగా అబాసు పాలవుతున్న శానిటేషన్ విభాగాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని వెల్లడిస్తున్నారు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో అదే వాహనాలు డీజిల్ మరియు పెట్రోల్ వాడకంలో అవినీతి ఆరోపణలు వినికిడి పట్ల మరియు శానిటేషన్ పై ఉన్నతాధికారులు వెంటనే దృష్టి సారించి అవినీతికి పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

best news portal development company in india