V1News Telangana

best news portal development company in india

తెలంగాణ స్టూడెంట్స్ పరిషత్ (T.S.P) ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా మావురం శ్రీకాంత్ నియామకం….

SHARE:

నిజామాబాద్ జిల్లా: తెలంగాణ స్టూడెంట్ పరిషత్ (T.S.P) ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా మావురం శ్రీకాంత్ ను శుక్రవారం రోజు తెలంగాణ స్టూడెంట్ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు భారీ అశోక్ ఏకగ్రీవంగా ఏనుకున్నట్లు నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మావురం శ్రీకాంత్ మాట్లాతూ తనపై నమ్మకంతో (T.S. P) తెలంగాణ స్టూడెంట్ పరిషత్ జిల్లా అధ్యక్షుడిగా నియమించిన రాష్ట్ర అధ్యక్షులు భారీ అశోక్ కుమార్ యాదవ్ కు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఉమ్మడి నిజామాబాద్ జిల్లా విద్యారంగ సమస్యలను, పరిష్కారం దిశగా మరియు ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్ళలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ అలాగే భవిష్యత్తులో రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు వారి అడుగుజాడల్లో గతంలో ఏ విధంగా పోరాటం చేశామో అదే స్ఫూర్తితో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని విద్యా రంగ సమస్యలపై మరియు విద్యార్థులను పట్టిపీడిస్తున్న ప్రైవేట్ పాఠశాలలు మరియు కళాశాలల యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యను వ్యాపారంగా మలచుకొని విద్యార్థుల తల్లిదండ్రుల జీవితాలతో చెలగాటాలు ఆడుతున్న కార్పొరేట్ విద్యా సంస్థల ఆగడాలను, రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి మరియు జిల్లా విద్యాశాఖ అధికారులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ విద్యార్థుల సమస్యల పరిష్కారం దిశగా పనిచేస్తానని తెలిపాడు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india