V1News Telangana

best news portal development company in india

రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి….

SHARE:

కామారెడ్డి జిల్లా: గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి గురువారం రోజు మృతి చెందినట్లు రైల్వే ఎస్సై తావు నాయక్ తెలిపారు. మాసాయిపేట్-వడియారం రైల్వే స్టేషన్ మధ్య పరిధిలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతుడి వయస్సు 35 నుండి 40 సంవత్సరాలు ఉంటుందని, మృతుడికి సంబంధించిన ఎటువంటి ఆధారాలు లభించలేదన్నారు. మృతుడిని ఎవరైనా గుర్తుపట్టినట్లయితే స్థానిక రైల్వే పోలీసులను సంప్రదించాలని తెలియజేశారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india