V1News Telangana

best news portal development company in india

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా బి.ఆర్.ఎస్ పార్టీ పతాక ఆవిష్కరణ….

SHARE:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ, దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని బి.ఆర్.ఎస్ పార్టీ యువజన విభాగం మండల అధ్యక్షుడు భాను ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీపీ పాల్థ్య విఠల్ , వైస్ ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎందరో అమరవీరుల ప్రాణ త్యాగాల వలన, ఉద్యమం ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిందని అన్నారు. కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ప్రయాణించిందని తెలిపారు. బి.ఆర్.ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పేద ప్రజల సంక్షేమం కొరకు కృషి చేసింది అన్నారు. ఎన్నో రకాల సంక్షేమ పథకాలను అమలు చేసి రాష్ట్రాన్ని దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాల సరసన నిలిపారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ ఉపసర్పంచ్ ఖలీల్, మాజీ వార్డు సభ్యుడు ఇమ్రాన్, చంద్రశేఖర్ గౌడ్, వైదికుల సాయికుమార్, గొడిసెల నరసింహులు గౌడ్, మంతపురి రామా గౌడ్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మామిడి భూమయ్య, ఎస్సీ సెల్ గ్రామ అధ్యక్షుడు టేకుర్ల సాయిలు, చుంచు శేఖర్, మోసిన్, దొంతి ప్రభాకర్, దేశ్ పాక్ సాయిలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india