V1News Telangana

best news portal development company in india

ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ, దశాబ్ధి ఉత్సవాల వేడుకలు……

SHARE:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై పది సంవత్సరాలు ముగించుకున్న సందర్భంగా, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు విజయ్ కుమార్ (నందు) రెడ్డి చేతుల మీదుగా జాతీయ పతాక ఆవిష్కరణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో అమరవీరుల ప్రాణత్యాగాల కారణంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడానికి సోనియాగాంధీ సహకారం మరువలేనిది అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన తర్వాత పది సంవత్సరాల కాలంలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్నారు. రాష్ట్రాన్ని వారి స్వప్రయోజనాల కొరకు రాజకీయ దుర్వినియోగానికి పాల్పడ్డారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి కృషి చేస్తుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ అరిగె సాయిలు, మండల కార్యదర్శి శివప్రసాద్, మైనారిటీ విభాగం మండల అధ్యక్షుడు యూసుఫ్, గ్రామ అధ్యక్షుడు అయినాల లింగం, మాజీ సర్పంచ్ తర్నం శాంతయ్య, నరేష్ పటేల్, పసుపు సాయికుమార్, మాజీ వార్డు సభ్యుడు ఉల్లెంగ గంగారం, డోన్గావ్ విఠల్, కర్ణం సాయిలు, తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india