V1News Telangana

best news portal development company in india

ఘనం గా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు.రాష్ట్ర ఏర్పాటుతో సంక్షేమం.. …. కమిషనర్ వెంకట రమణ

SHARE:

బోధన్.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించారు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. రాష్ట్ర అవతరణకు త్యాగాలు చేసిన అమరవీరులను స్మరించుకున్నారు. బోధన్ మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేశారు. బోధన్ మున్సిపల్ చైర్మన్ పద్మావతి శరత్ రెడ్డి , మున్సిపల్ కౌన్సిలర్లు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భం గా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పాషా మొయినుద్దీన్ మాట్లాడుతూ రాష్ట్ర ఏర్పాటు కోసం జరుగు తున్న ఉద్యమ తీవ్రత పై స్పందించిన అప్పటి యు పి ఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ చొరవ వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిందన్నారు.

రాష్ట్ర ఏర్పాటుతో సంక్షేమం..
…. కమిషనర్ వెంకట రమణ
బోధన్ . తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు చురుకుగా కొనసాగుతున్నాయని మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ అన్నారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపల్ కా ర్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ తల్లి చిత్ర పటానికి పూల మాలలు వేసి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.అనంతరం అమరవీరులకు నివాళులు అర్పించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర అవతరణ దినోత్సవాలను తెలంగాణ నిర్వహించినట్లు కమిషనర్ తెలిపారు. మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు..

 

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india