V1News Telangana

best news portal development company in india

ప్రమాదాలకు నిలయంగా ఎన్టిపిసి మేడిపల్లి ఎఫ్ సి ఐ సెంటర్  …. ప్రాణాలను హరిస్తున్న సిగ్నల్ …. ప్రమాదరహిత చర్యలు శూన్యం పట్టించుకునే నాధుడే కరువు

SHARE:

ప్రమాదాలకు నిలయంగా ఎన్టిపిసి మేడిపల్లి ఎఫ్ సి ఐ సెంటర్

ప్రాణాలను హరిస్తున్న సిగ్నల్

ప్రమాదరహిత చర్యలు శూన్యం పట్టించుకునే నాధుడే కరువు

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం:- 31:-

రామగుండం ఎన్టిపిసి రాజీవ్ రహదారి ఎఫ్సీఐ సెంటర్ సిగ్నల్స్ నుండి మేడిపల్లి సిగ్నల్ సెంటర్ వరకు రోజుకొక ప్రమాదం సంభవిస్తుంది దీనిపై అధికారులు ఇలాంటి చర్యలు తీసుకుపోవడం వల్ల అనేక రోడ్డు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాల వల్ల అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి కుటుంబంలో కొంతమంది పెద్దదిక్కును కూడా కోల్పోయామని ఆవేదన చెందుతున్నారు. నిత్యం రద్దీగా తిరిగే ప్రాంతాలలో భారీ వాహనాలు రాకపోకలతో హడావిడిగా మారింది దీంతో ప్రయాణికులకు అటువైపు వెళ్లాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారు. ఒకవైపు ఎన్టీపీసీ మరోవైపు ఎఫ్సీఐ ప్లాంట్ ఉండడంతో అనేక భారీ వాహనాలు రహదారిపై రావడంతో సిగ్నల్ వద్ద అనేక ప్రమాదాలు తరచుగా జరుగుతున్నప్పటికీ అటు హెచ్ కె ఆర్ టోల్ అధికారులు గాని ఇతర అధికారులు పట్టించకపోవడంతో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో ఎఫ్సీఐ క్రాస్ రోడ్ నుండి మేడిపల్లి సెంటర్ ఆనుకొని రామగుండం వైపు వెళ్లే మార్గంపై నుండి వంతెన నిర్మాణం కొరకు పాలకులు కృషి చేసినప్పటికీ అది కేవలం ప్రయత్నం గానే మారింది. ఈ ప్రభుత్వమైనా మేజర్ ఏరియాలో వంతెన నిర్మాణం చేపట్టాలని దాని ద్వారా రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండే అవకాశాలు ఉన్నాయని పలువురు ప్రజలు కోరుతున్నారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే కలెక్టర్ ఇతర అధికారులు స్పందించి వెంటనే రహదారిపై వంతెన నిర్మించాలని ప్రజలు ఆవేదన పడుతున్నారు.

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

best news portal development company in india