V1News Telangana

best news portal development company in india

ఇసుక అక్రమ రవాణాను అరికట్టడంలో అధికారులు విఫలం. ఒక్క వేబిల్లుపై పదుల సంఖ్యలో ఇసుక రవాణా కల్ దుర్కి గ్రామంలో ఇసుక దంపులు సీజ్ చేయక పోవడం పై పలు అనుమానాలు అధికారుల కనుసన్నల్లో జరుగుతున్నట్లు ఆరోపణలు

SHARE:

యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా పట్టించుకోని అదికారులు.బోధన్ మండలం కల్దుర్కి ,సిద్దాపూర్ శివారునుండి డోజర్ లతో మంజీరా నదినుండి ఇసుక తోడేస్తున్నారు.పంట పొలాల మధ్యలో నుండి ట్రాక్టర్ లలో ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారు.

ప్రభుత్వ అనుమతులు ఉన్న రోజు కండ్ గావ్ ఇసుక పాయింట్ వద్ద వే బిల్ తీసుకొని సిద్దాపూర్, కల్ దుర్కి శివారుల నుండి ఒకే వే బిల్ పై పదుల సంఖ్యలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు.సంబంధిత శాఖ రెవెన్యూ,  అధికారులకు తెలిసిన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇక చూస్తే మైనింగ్ .మరియు . ఆర్. టి. వో . అధికారుల జాడనే లేదు .ప్రజలు ఆరోపిస్తున్నారు.పర్యవేక్షణకు వెళ్లిన కొందరు అధికారులు మామూళ్లు తీసుకొని ఇసుక అక్రమ రవాణాకు సహకరిస్తున్నారనే ఆరోపణలు వెలువెత్తు తున్నాయి. ఇసుక అక్రమ రవాణా ట్రాక్టర్లు టిప్పర్లు వెళుతున్న పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.గ్రామాలలో ఇసుక మాఫియా రెచ్చిపోతున్న ఎదిరించిన వారిపై,ప్రశ్నించిన వారిపై దాడులకు తెగబడుతుంది. .ఇసుక అక్రమ రవాణాను అరికట్టాల్సిన అధికారులే మామూళ్లు తీసుకొని చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.ఇసుక అక్రమ రవాణా పై ,టౌన్ ఎమ్మార్వో,ఆర్డీవో,రూరల్ ఆరై కి పలుమార్లు ఫిర్యాదు చేసిన ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో కల్ దుర్కి గ్రామంలోని ఇసుక మాఫియా దారులు ఇండ్ల ముందు కలిస్తలంలో,పొలాల్లో ఇసుక దంపు చేసుకొని పెట్టుకున్న ఆ ఇసుక డంప్ లను అధికారులు సీజ్ చేయక పోవడంపై ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india