V1News Telangana

best news portal development company in india

రైకూరు లో ప్రయివేట్ సంస్థ కోసం వెహిబిల్ ద్వారా మొఱ్ఱం త్రవకలు…… రెవిన్యూ అధికారులు మేనేజ్ అయ్యారు అంటున్న స్థానికులు….

SHARE:

రుద్రూర్ మండలం రైకూరు గ్రామం లోని గుట్ట ప్రాంతం లో గుట్టు చప్పుడు లేకుండా కొందరు నాయకుల అండదండలతో మొఱ్ఱం త్రవకలు జరుపుతున్నారు. ఓ ప్రయివేట్ రైస్ మిల్లు నూతన నిర్మాణం కోసం రెవిన్యూ అధికారులు ఇచ్చిన వెహిబిల్ ఉన్నాయి. అసలు మొఱ్ఱం త్రవకలు గుట్ట ప్రాంతాల్లో చేయడానికి వీళ్ళు ఎలా అర్హులు అవుతారు, వీళ్ళ కు పర్మిషన్ ఇచ్చిన మహానుభావులు ఎవరు దొంగ వేహబిల్ పేరిట దో నెంబర్ దందా చేస్తున్నా మొఱ్ఱం మాఫియా పై చర్యలు తీసుకోవాల్సిన వారు నిద్ర మత్తులో ఉండటం స్థానిక ప్రజలను ఆశ్చర్య పరుస్తుంది.రైకూరు గుట్ట లో వేల సంవత్సరాలనుండి మాలిక్ లతీఫ్ దేవుడు ఉన్నాడు ఆయన స్థలాని కొంతమంది ఆక్రమిచ్చారు అదే భూమి లో పంటలు పండిస్తూ వస్తున్నారు మరి ఆ భూమి తమ దంటూ ఆ భూమిలో మొరం త్రవకలు జరుపుతూ డబ్బులు సంపాదిస్తున్నారు అటు రెవిన్యూ అధికారులు పెర్మిషన్ ఇవ్వలేదు అంటారు మరి ఎందుకు మొఱ్ఱం త్రవకలు ఆపడం లేదు అంటూ రైకూరు గ్రామస్థులు మండిపడుతున్నారు. ఇప్పటి కైనా రుద్రూర్ తహసీల్దార్ రైకూరు గుట్ట ప్రాంతం లో జరుగుతున్న మొఱ్ఱం మాఫియాను అరికట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

IRFAN Reporter
Author: IRFAN Reporter

Work from as a journalist

best news portal development company in india