…రుద్రూర్ మండల కేంద్రంలోని అక్బర్ నగర్ గ్రామంలో జన్మించిన కార్తీక్ 28 సంవత్సరాలుగా గ్రామంలోనే ఉంటున్నాడు. అయితే తనకు క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలని తాసిల్దార్ కార్యాలయం ఎదుట ఎన్ని చక్కర్లు కొట్టిన లాయర్ ఎఫిడివైట్ తీసుకొచ్చేంత వరకు క్యాస్ట్ సర్టిఫికెట్ ఇచ్చే ప్రసక్తే లేదని రుద్రూర్ తాసిల్దర్ గారు చెబుతున్నారని ఆ బాధితుడు మీడియా ముందుకు వచ్చి తన గోడును వినిపించాడు. నోటరీ కొట్టించుకొని రావాలంటే 200 లకు పైగా డబ్బులు అవుతాయని డబ్బులు లేని వారి పరిస్థితి ఏంటని నోటరీ ఉంటేనే క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వాలని ఎక్కడైనా ఉందా అని తహసిల్దార్ గారిని నేను ప్రశ్నించానని ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడితే పోలీసులకు పిలుస్తా అని తహసిల్దార్ చెప్పినట్టు కార్తీక్ మీడియ ముందుకు వచ్చి తెలిపాడు. అయ్యా తహసిల్దార్ గారు జర గరీబోళ్లము చూడండి సారు పైసలు లేక ముందే పరేషాన్ లో ఉన్నాము మేము ఎస్సి కులానికి చెందిన వరమో కాదో మా గ్రామం లోని మీ సిబ్బంది ద్వారా కావాలంటే ఎంక్వైరీ చేయండి సారు అన్నట్టు కార్తీక్ బాధతో తెలిపాడు. జిల్లా స్థాయి అధికారుల వద్దకు వెళ్లే ముందు మీడియను సంప్రదించడం మేల్ అనుకున్నాను కాబట్టే మీడియాలో ద్వారా తన బాధను చెబుతునని కార్తీక్ తెలిపాడు.ఇప్పటికైనా రుద్రూర్ తాసిల్దార్ గారు నాయందు దయ తలచి నాకు ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వాలని కోరుకుంటున్నట్టు కార్తీక్ తెలిపాడు. మరి రుద్రూర్ తాసిల్దార్ గారు ఒకవేళ ఆయన ఎస్సీ కాకుంటే ఆయన క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వకండి ఒకవేళ ఎస్సీ అయితే ఆయన క్యాసెఫ్టిఫికెట్ ఇవ్వాలని స్థానిక ప్రజలు సైతం కోరుతున్నారు. అందరికీ నోటిసు తీసుకురావడం ఇబ్బందిగా ఉందని మీ సేఫ్టీ కోసం ప్రజలను బలి చేస్తారా సారు అన్నట్టు కొందరు స్థానిక ప్రజలు సైతం ప్రశ్నిస్తున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








