V1News Telangana

best news portal development company in india

స్థానిక 38వ డివిజన్ బిఆర్ఎస్ కార్పొరేటర్ జంగపెల్లి సరోజన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు

SHARE:

స్థానిక 38వ డివిజన్ బిఆర్ఎస్ కార్పొరేటర్ జంగపెల్లి సరోజన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం మే 10:-

గోదావరిఖని రెడ్డి కన్వెన్షన్ హాల్లో  మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, & రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ విలేకరుల సమావేశం అనంతరం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాండురంగారావు ఆధ్వర్యంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 38వ డివిజన్ బిఆర్ఎస్ కార్పొరేటర్ జంగపెల్లి సరోజన బిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షురాలు లత కాంగ్రెస్ పార్టీలో చేరారు..రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సమక్షంలో దుద్దిల్ల శ్రీధర్ బాబు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు..వారితో పాటుగా దాదాపుగా వందమంది డివిజన్ ప్రజలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ చేరికల కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నగర, పట్టణ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలతో పాటు అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

best news portal development company in india