V1News Telangana

best news portal development company in india

అయోధ్య రామ మందిరం నిర్మాణం తీర్పు సుప్రీకోర్టు ధీ…. రాముడు అందరికి దేవుడు పార్టీ ల పేరుతో దేవుళ్లను విడగొటక్కండి…. సురేష్ షాట్కార్ 

SHARE:

ఎన్నికల ప్రచార విభాగం లో బాగంగా జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ షాట్కార్ నిన్న రాత్రి నిజామాబాదు జిల్లా రుద్రూర్ మండల కేంద్రం లో కార్నర్ మీటింగ్ నిర్వహించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ రాముని బీజేపీ పార్టీ తమ స్వార్ధం కోసమే వినియోగిస్తుందనారు. రాముడు అందరికి దేవుడని రామాలయాలకు తము కూడా వెళ్తామని నా ఇంటి ముందు రామాలయం ఉందని సురేష్ షాట్కార్ అన్నారు. దేవునికి పార్టీ లకు ఎమ్ సంబంధం ఉందని ఎందుకు దేవుని పేరు చెప్పి ఓట్లు తీసుకునే ప్రయత్నలు బీజేపీ పార్టీ చేస్తుందో అర్థం కావటం లేదని సురేష్ షాట్కాట్ మండిపడ్డారు. అయోధ్య లో నిర్మించిన రామ మందిరం తీర్పు ఇచ్చింది సుప్రీం కోర్టు అయోధ్య లో కట్టిన రామలయాని అందరు కలిసి కట్టుకున్నారని కట్టిన తరువాత నరేందర్ మోదీ అక్కడకి వెళ్లి పూజ చేసి తనే కట్టినట్టు ప్రచారం చేసుకున్నాడని సురేష్ షాట్కార్ తెలిపారు. మతాల పేరిట రాజకీయాలు చేస్తూ ప్రజలో ద్వేషలను పెంచి ఓటు బ్యాంకు గా బీజేపీ ఉపయోగించుకుంటుందని, యువతరం మేలుకోవాలని తము కూడా హిందువులమే కధా మరి వారే పూజిస్తారా మేము పూజించమ రాముని,మా ఊర్లో ఉన్న రామాలయ గుడి కి పునః నిర్మాణం చేయిస్తునని సురేష్ షాట్కాట్ అన్నారు. అదేవిధంగా మాజీ జహీరాబాద్ ఎంపీ బిబి పాటిల్ కు తెలుగు సరిగ్గ మాట్లాడటం రాదని రెండు సార్లు గెలిచినా ఒక్క సారి అయిన బాన్స్వాడ లో అడుగు పెట్టాడా అయన మరి రెండు సార్లు గెలిపించిన పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు బిబి పాటిల్ ను కాంట్రాక్టర్ అంటున్నాడు మరి రెండు సార్లు అయన తరుపున ప్రచారం చేసినప్పుడు బిబి పాటిల్ బుద్ధి మంతుడు అనిపించడ పోచారం శ్రీనివాస్ రెడ్డి కి అన్నట్టు సురేష్ షాట్కార్ కార్నర్ మీటింగ్ లో తెలిపారు. ప్రజలు అలోచించి తమ బహుమూల్య ఓటును వినియోగించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు.ఈ కార్యక్రమం లో బాన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ మంత్రి మండా వెంకటేశ్వర్ రావు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు తహెర్బిన్ హందన్, మాజీ ఎంపీటీసీ ఫోరమ్ అధ్యక్షులు ఎలామంచిలి శ్రీనివాస్ రావు, బాన్స్వాడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇందూర్ చంద్రశేఖర్, రుద్రూర్ మండల అధ్యక్షులు తోట అరుణ్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

IRFAN Reporter
Author: IRFAN Reporter

Work from as a journalist

best news portal development company in india