V1News Telangana

best news portal development company in india

ఏనుగు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉదృతంగా కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం….

SHARE:

బాన్సువాడ గ్రామీణ మండలం: మండలంలో గల హన్మాజీపేట్ గ్రామంలో పార్లమెంటు ఎన్నికల సందర్భంగా జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ కు మద్దతు తెలుపుతూ బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల ఊర్లు శ్యామ్ రావ్ తాండ, కోకల్ దాస్ తాండ, పులిగుట్ట తాండ, చింతల్ పేట్, పైడిమల్ సిద్దాపూర్, గ్రామాల నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడుతుందన్నారు. తన దృష్టికి వచ్చిన అంశం ఈ ప్రాంతంలో నిర్మాణం కావాల్సి న సిద్దాపూర్ రిజర్వాయర్ దాని నిర్మాణం పూర్తయితే దాదాపు 18 వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు అందుతాయని తెలిపారు. టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పోచారం శ్రీనివాస్రెడ్డి సిద్దాపూర్ రిజర్వాయర్ పేరుతో బీర్కూర్ క్వారీల నుండి ఇసుకను తరలించి అమ్ముకోవడానికి తప్ప ప్రజలకు మేలు చేయాలని ఆలోచన లేదన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రిజర్వాయర్ నిర్మాణాన్ని చేయిస్తానని ఇప్పుడు మౌనం పాటిస్తున్నాడని ఎద్దేవా చేశారు. రాబోయే లోక్ సభ ఈ ప్రాంతం నుండి అన్ని గ్రామాలలోని బూతులలో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ తీసుకొచ్చి ఎంపీ అభ్యర్థిని గెలిపించినట్లయితే సంబంధిత శాఖ మంత్రి మరియు ముఖ్యమంత్రి కాళ్లు పట్టుకొని అయినా సరే సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేసి ఆయకట్టు రైతులకు నీళ్లనిచ్చే బాధ్యత నేను తీసుకుంటాను అని శపదం చేశాడు.ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు పరుస్తూ నెరవేరుస్తుందన్నారు. ప్రజలు వారి వారి సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే ఎన్నికల అనంతరం వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. గ్రామంలోని చాలామంది ప్రజలు కనీస వసతులు లేక ఇబ్బందులు పడడం బాధాకరం అన్నారు. ఎన్నికల అనంతరం తప్పకుండా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఉచిత విద్యుత్తు, సిలిండర్ పథకం, మహిళలకు 2500 జీవన భృతి, ఆసరా పెన్షన్లు, రైతుబంధు, ఆరోగ్యశ్రీ అమలు, ఆగస్టు 15 నాటికి రైతు రుణమాఫీ చేసి తీరుతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న విషయాన్ని గుర్తు చేశారు. మే 13వ తేదీన కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్మాజిపేట్ మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india